జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయక తప్పదని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాళ్ చారి అన్నారు. మంగళవారం రేగోడు, అల్లాదుర్గం, పెద్ద శంకరంపేట మండల కేంద్రాలలో సభ్యత సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని రేగోడు, అల్లాదుర్గ్, టేక్మాల్ మండల కేంద్రాలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవ చూపాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం యూనియన్ పని చేస్తుందని పేర్కొన్నారు. మూడు మండలాలకు సంబంధించిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో అవసరమైతే ఆందోళనకు సిద్ధమన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేసేలా స్పషమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విట్టల్ రావు, ఆనంద్ కుమార్,జనార్దన్ రాజ్, రేగోడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్, అల్లాదుర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఘుపతి, పెద్ద శంకరంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్, యూనియన్ బాధ్యులు ప్రభాకర్, సంతోష్, కృష్ణ, లావణ్య, షఫీ, సుభాష్, వెంకటేష్, వీరన్న, శంకర్, పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం:టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి