Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

Updated : 24 Nov 2026 20:44 IST
As Preferred Source 1 min read
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మండలంలోని వివిధ ఆలయాలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి, కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివనామస్మరణ, భక్తుల ప్రార్థనలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాసాలు పాటిస్తూ భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో మండలంలోని ఆలయాలన్నీ భక్తుల రాకతో కిటకిటలాడాయి.

Sthanikam

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి