Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పేద మహిళలకు చీరల పంపిణీ.. సేవా సమితిపై సినీ ప్రముఖుల ప్రశంసలు

Updated : 24 Nov 2026 20:44 IST
As Preferred Source 1 min read
పేద మహిళలకు చీరల పంపిణీ.. సేవా సమితిపై సినీ ప్రముఖుల ప్రశంసలు

మునగాల మండలం నరసింహపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏడు గ్రామాలకు చెందిన సుమారు 800 మంది మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సినీ నిర్మాత అప్పిరెడ్డి, నటి శివపార్వతి ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోదండరామ సేవా సమితి పేరుతో గత 16 సంవత్సరాలుగా నిరంతరం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవ సేవతో పాటు పేదలకు అండగా నిలుస్తూ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ చేస్తున్న సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనపనేని భార్గవ్, వేముల వెంకటేశ్వర్లు, రంగస్థల నటుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య, చక్రధర్ రావు, జల్లా జనార్దన్ రావు, డీసీ వెంకటేశ్వరరెడ్డి, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద మహిళలకు చీరల పంపిణీ.. సేవా సమితిపై సినీ ప్రముఖుల ప్రశంసలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి