Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

అరగంటలోనే పోగొట్టుకున్న నగదు తిరిగి.. బాధితుడికి అండగా నిలిచిన హద్నూర్ పోలీసులు

Updated : 26 Nov 2026 13:58 IST
As Preferred Source 1 min read
అరగంటలోనే పోగొట్టుకున్న నగదు తిరిగి.. బాధితుడికి అండగా నిలిచిన హద్నూర్ పోలీసులు

పోగొట్టుకున్న నగదును బాధితుడికి తిరిగి అందించి హద్నూర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 26వ తేదీ ఉదయం 11:45 గంటలకు శంశోద్దిన్‌పూర్ గ్రామానికి చెందిన యాదయ్య హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన సమస్యను పోలీసులకు వివరించారు. జహీరాబాద్ నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో గంగ్వార్ వద్ద దిగేటప్పుడు తొందరలో తన బ్యాగును ఆటోలోనే మరిచిపోయానని, అందులో రూ.31,240 నగదు ఉందని తెలిపారు. వెంటనే స్పందించిన హద్నూర్ ఎస్ఐ తన సిబ్బంది రవికుమార్ (పీసీ 3321)తో కలిసి సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. కేవలం 30 నిమిషాల్లోనే బాధితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించి, అది హద్నూర్ గ్రామానికి చెందిన సద్దాం నడుపుతున్న ఆటో (నంబర్ TS15 UC 5724)గా నిర్ధారించారు. అనంతరం ఆటో డ్రైవర్‌ను సంప్రదించి విచారించగా, బ్యాగు ఉన్న విషయం తనకు కూడా తెలియలేదని తెలిపాడు. దీంతో బ్యాగులో ఉన్న రూ.31,240 నగదును బాధితుడు యాదయ్యకు పోలీసులు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి హద్నూర్ పోలీసులు సిద్ధంగా ఉంటారని ఎస్ఐ తెలిపారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

అరగంటలోనే పోగొట్టుకున్న నగదు తిరిగి.. బాధితుడికి అండగా నిలిచిన హద్నూర్ పోలీసులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి