చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన బంధువుల ఆచూకీ కోసం చౌటుప్పల్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన దుర్గ ప్రసాద్ (42) ఎడమ కాలికి గాయమై ఇన్ఫెక్షన్ సోకడంతో గతేడాది అక్టోబరు 23న ఒంటరిగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబరు 23న ఆయన మృతి చెందారు.మృతుడి వద్ద కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. దుర్గ ప్రసాద్ కుటుంబ సభ్యులు, బంధువులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి