Sthanikam - Truth Matters
Logo

నాకప్ కాంట్రాక్టు సంస్థను రద్దు చేయాలి

Updated : 26 Nov 2026 11:50 IST
As Preferred Source 1 min read
నాకప్ కాంట్రాక్టు సంస్థను రద్దు చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్దకాపర్తి వసతి గృహం వద్ద నిరసన.

చిట్యాల: సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ డిమాండ్ చేశారు. గురువారం పెద్దకాపర్తి బీసీ బాలుర వసతి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న నాకప్ కాంట్రాక్టు సంస్థను రద్దు చేయాలని, కేంద్రీకృత సరుకుల సరఫరా విధానంతో పాటు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఎత్తివేయాలని కోరారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చిట్యాల మండల కన్వీనర్ చింత చందు, చిట్టా హరీష్, ఆరూర్ శివ, గోలి మచ్చగిరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నాకప్ కాంట్రాక్టు సంస్థను రద్దు చేయాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి