కాలుష్యంతో స్థానికుల అవస్థలు.. ధాన్యంపై పడుతున్న నల్లటి ధూళి.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని MPL కంపెనీ నుంచి వెలువడుతున్న నల్లటి ధూళితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలిలో బ్లాక్ డస్ట్ వ్యాపించడంతో కళ్ల మంట, దురదతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కంపెనీ పక్కనే ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై నల్లటి ధూళి పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యపై పలుమార్లు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత కాలుష్య నియంత్రణ అధికారులు వెంటనే స్పందించి కంపెనీలో తనిఖీలు నిర్వహించి, కాలుష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి