ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత రక్షణ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వర్కాల వెంకట్ కుమార్ గౌడ్ కోరారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా సదుపాయం లభిస్తుందని తెలిపారు.కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అర్హులందరికీ ఈ బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలతో దరఖాస్తు చేసుకొని తమ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి