Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా జీఎంఆర్ ఫౌండేషన్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 10:27 PM

గ్రామ పాలన అధికారుల కృతజ్ఞత సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆహ్వానం

01-10-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ పాలన అధికారులుగా నియామకమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించనున్న కృతజ్ఞత సభకు హాజరుకావాలని గ్రామ పాలన అధికారుల సంఘం నాయకులు జగ్గారెడ్డిని ఆహ్వానించారు. గురువారం ఐబీ అతిథి గృహంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తిరిగి తమ సొంత శాఖల్లో విధులు నిర్వహించే అవకాశం లభించిందని వారు వివరించారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ పాలన అధికారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుజాత, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ పాలన అధికారుల కృతజ్ఞత సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆహ్వానం

Article Image

గ్రామ పాలన అధికారులుగా నియామకమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించనున్న కృతజ్ఞత సభకు హాజరుకావాలని గ్రామ పాలన అధికారుల సంఘం నాయకులు జగ్గారెడ్డిని ఆహ్వానించారు. గురువారం ఐబీ అతిథి గృహంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తిరిగి తమ సొంత శాఖల్లో విధులు నిర్వహించే అవకాశం లభించిందని వారు వివరించారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ పాలన అధికారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుజాత, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News