Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:58 PM

సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి: జగ్గారెడ్డి, నిర్మల

10-10-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కూల్చివేతలు లేకుండా రోడ్డు నిర్మించాలి.. అక్టోబర్ 30లోగా అంచనాలు సిద్ధం చేయాలి

సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల జగ్గారెడ్డితో కలిసి సిద్దాపూర్ రోడ్డును పరిశీలించిన ఆయన, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల, కల్వర్టుల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. మెయిన్ రోడ్డు నుంచి సిద్దాపూర్ ఈద్గా వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు నిర్మించాలని, వర్షపు నీరు నిలవకుండా సరైన లెవల్స్‌తో డ్రైన్లు, అవసరమైన చోట కల్వర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డు నిర్మాణం పేరుతో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని, పాన్‌షాపులు, పూల దుకాణాలు, మటన్, చికెన్ దుకాణాలతో పాటు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి రోడ్డు వెడల్పును నిర్ణయించి, సిద్దాపూర్ కూడలిని కూడా అభివృద్ధి చేయాలని, రోడ్డు పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ పనులకు రూ.2 కోట్ల నిధులతో పాటు మున్సిపాలిటీలో టీఎఫ్‌ఐడీసీకి చెందిన మరో రూ.5 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అక్టోబర్ 30లోగా రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు నిర్మించానని గుర్తుచేస్తూ, ఇకపై సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పట్టణ, మండల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిరోజూ ఒక ప్రాంతంలో పర్యటిస్తానని, త్వరలో ఊబ చెరువును కూడా పరిశీలిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

Sthanikam

సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి: జగ్గారెడ్డి, నిర్మల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News