వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ బుధవారం సిర్గాపూర్ పోలీస్ స్టేషన్, కంగ్టి సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు.సిర్గాపూర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో నారాయణఖేడ్ డీఎస్పీతో కలిసి మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, రికార్డుల నిర్వహణ, కేసులకు సంబంధించిన వాహనాలు, ఆస్తులను పరిశీలించారు. కేసులకు సంబంధించిన ఆస్తులను కోర్టులో సమర్పించే వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి పగలు, రాత్రి బీట్ విధుల్లో నిఘా పెంచాలని, దర్యాప్తులో ఉన్న కేసులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్, ఇతర కేసులను ప్రత్యేక ప్రణాళికతో త్వరితగతిన పరిష్కరించాలని, రాష్ట్ర సరిహద్దుల నుంచి జరిగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు.పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్–2.0, టీఎస్–కాప్, ఈ–సాక్ష్య, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, వేలిముద్ర పరికరాలు తదితర సాంకేతిక సాధనాలపై పూర్తి అవగాహన పెంచుకుని, నేరాల నియంత్రణ, దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించేలా భరోసా కల్పించాలని, గ్రామ పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు.సస్పెక్ట్,హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచి వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
అనంతరం కంగ్టి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ కార్యాలయ పరిశుభ్రత,రికార్డుల నిర్వహణను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న తీవ్రమైన కేసులు, మిస్సింగ్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక బృందాలతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.గంజాయి అక్రమ రవాణా, సాగుపై కఠిన చర్యలు తీసుకోవాలని,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి దాబాలు, పెట్రోల్ బంకుల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల నిర్వహణ,రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని ఎస్పీ పేర్కొంటూ అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు.విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.ఈ తనిఖీలలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్‌ఐ మహేష్, సర్కిల్ ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిర్గాపూర్ పోలీస్ స్టేషన్, కంగ్టి సర్కిల్ కార్యాలయాల తనిఖీ చేసిన ఎస్పీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి