నారాయణఖేడ్‌లోని వాగ్దేవి (జనరల్ & వొకేషనల్) జూనియర్ కళాశాలకు చెందిన ఎం.పి.సి ద్వితీయ సంవత్సరం విద్యార్థి వి. వంశీ అండర్–19 కబడ్డీ విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో రాష్ట్ర స్థాయి జట్టులో చోటు సంపాదించడం పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.వంశీ రాష్ట్ర స్థాయిలోనూ అద్భుతంగా రాణించి మంచి ప్రతిభ కనబరచాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, నారాయణఖేడ్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంశీకి కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
PRINT TIME: October 03, 2026 08:07 PM
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు వాగ్దేవి కళాశాల విద్యార్థి వంశీ ఎంపిక

03-10-2026
146 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్‌లోని వాగ్దేవి (జనరల్ & వొకేషనల్) జూనియర్ కళాశాలకు చెందిన ఎం.పి.సి ద్వితీయ సంవత్సరం విద్యార్థి వి. వంశీ అండర్–19 కబడ్డీ విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో రాష్ట్ర స్థాయి జట్టులో చోటు సంపాదించడం పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.వంశీ రాష్ట్ర స్థాయిలోనూ అద్భుతంగా రాణించి మంచి ప్రతిభ కనబరచాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, నారాయణఖేడ్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంశీకి కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి