Sthanikam - Truth Matters
Logo

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ దుర్మరణం

Updated : 24 Nov 2026 13:32 IST
As Preferred Source 1 min read
రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ దుర్మరణం

లారీ ఢీకొని ఇద్దరు యువకుల మృతి.. కుటుంబాలకు అండగా ఉంటామని కేసీఆర్ భరోసా.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్ రెడ్డి ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు భరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ దుర్మరణం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి