హుజూర్‌నగర్ ఎస్‌ఐ నరేష్‌పైనా చర్యలు.. అక్రమాలు, నిర్లక్ష్యంపై ఎస్పీ కొరడా.
సూర్యాపేట: జిల్లా పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు కొనసాగుతున్నాయి. విధి నిర్వహణ మాటున అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ నరసింహా కఠిన చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు స్క్రాప్ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేశారు.వాహన తనిఖీల పేరుతో రూ.21 వేల వరకు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, అక్రమ వసూళ్ల వ్యవహారం నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బుల్లెట్ బైక్ మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ నరేష్‌పైనా సస్పెన్షన్ వేటు పడింది. ఒకవైపు అక్రమ వసూళ్లు, మరోవైపు కేసుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం, ఖాకీ ముసుగులో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ఈ వరుస చర్యలు వెల్లడిస్తున్నాయి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి