- కోర్టులను సైతం లెక్కచేయని కబ్జాదారులు
- కొంతమంది అధికారులతో కుమ్మక్కై దొంగ పట్టాల సృష్టి
- మా భూములను ఇతరులకు అమ్ముతున్న కబ్జాదారులు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్:మా భూములను అన్యాయంగా,ఆక్రమంగా కొంతమంది ఆక్రమించుకు న్నారని,వెంటనే మా భూములు మాకు ఇప్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా,రాజాపేట మండల పరిధిలోని నేమీల గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తమ భూములు కబ్జా విషయంపై కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డొంకన విట్టలయ్య,డెంకెన ఆనందం,డెంకెన రాజేశ్వర్,డొంకెన వీరాస్వామి,శ్రీనివాస్,దూడల రామలీల, కన్నరాజశ్రీ, మాట్లాడుతూ,తమకు సంబంధించిన 33 ఎకరాల భూమిని పులి సత్యనారాయణ,పులి చంద్రమౌళి అనువారు ఆక్రమించుకున్నారని తెలిపారు. వీరి మీద కోర్టులో కేసు ఉన్నా కూడా ఆ కేసును లెక్కచేయకుండా ఇతరులకు మా భూములను అమ్ముతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వీరు మమ్మల్ని మోసం చేయడంతో పాటు,కొన్నవారిని కూడా మోసం చేస్తున్నారని,కోర్టులో కేసు ఉండగా మా భూమిని పులి సత్యనారాయణ,పులి చంద్రమౌళి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినా చల్లదని వారు తెలిపారు. సర్వేనెంబర్ 73లో మేము ఎవరికీ అమ్మనటువంటి 8 ఎకరాల భూమిని కూడా కొంతమంది అధికారులతో కొమ్మక్కై,దొంగ సంతకాలు సృష్టించి,పట్టాదారుల సంతకాలు పోల్చరీ చేసి,సాదాబైనామ,ఆర్ఓఆర్ కింద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పట్టాలు చేయించుకుంటు న్నారని వారు తెలిపారు. ఈ విషయాన్ని కూడా మేము కోర్టులో ఫిర్యాదు చేసి ఈ కబ్జాలకు పాల్పడిన వారికి నోటీసులు కూడా జారీ చేయించడం జరిగిందన్నారు.భువనగిరి జిల్లా కలెక్టర్ వెంటనే ఈ అక్రమ డాక్యుమెంట్ మీద,భూకబ్జాల మీద,విచారణ జరిపి దోషులను శిక్షించి,మా భూములను మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామని వారు తెలిపారు.
నిరంతరం ప్రజాహితం -జర్నలిస్ట్ శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి