ఈ నెల 27న ఆలేరు పట్టణంలో జరిగే మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని మంత్రులకు ఆహ్వానం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, నూతన చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్.
ఆలేరు నియోజకవర్గం/ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్యతో పాటు నూతనంగా నియమితులైన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్ పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించనున్న ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్,డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని మంత్రులను ఆహ్వానించారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి సందీప్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలెేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ...ఆలేరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమం,వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా నూతన మార్కెట్ కమిటీ పనిచేయాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్ల నియామకంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.రైతుల సమస్యల పరిష్కారం,పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు,మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలని సూచించారు.మంత్రులు కూడా ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతామని తెలియజేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు,ప్రజాప్రతినిధులు,రైతులు,నాయకులు,కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరంతరం ప్రజాహితం -జర్నలిస్ట్ శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి