Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న భక్తులు.. మారుమోగిన శరణుఘోష

Updated : 23 Nov 2026 20:31 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న భక్తులు.. మారుమోగిన శరణుఘోష

కోదాడ: కార్తిక మాసం, అయ్యప్ప స్వామి మాలధారణను పురస్కరించుకుని కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ ఎర్ర సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ, భజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా పడిపూజ చేపట్టారు. అనంతరం నిర్వహించిన భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి భక్తి గీతాలు, శరణుఘోషతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తిక మాసంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావంతో పాటు ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని భక్తులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

Sthanikam

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న భక్తులు.. మారుమోగిన శరణుఘోష

Article Image

కోదాడ: కార్తిక మాసం, అయ్యప్ప స్వామి మాలధారణను పురస్కరించుకుని కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ ఎర్ర సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ, భజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా పడిపూజ చేపట్టారు. అనంతరం నిర్వహించిన భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి భక్తి గీతాలు, శరణుఘోషతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తిక మాసంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావంతో పాటు ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని భక్తులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి