మునగాల మండలం గణపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎ. మత్తయ్య అధ్యక్షతన గణపవరం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని ఎంపీడీవో డి. నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ యజమానులకు ఈ పథకం ద్వారా బీమా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమాని బీమా పొందేందుకు అర్హులని, కుటుంబం నుంచి ఇద్దరిని నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డేటా ఎంట్రీ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చందా చంద్రయ్య, పీఎస్ డి. సైదులు, జీపీఓ పి. పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే లక్ష్యం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి