Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

దన్వార్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి అదృశ్యం

Updated : 23 Nov 2026 20:31 IST
As Preferred Source 1 min read
దన్వార్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి అదృశ్యం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం దన్వార్ గ్రామానికి చెందిన సంగజోల్ల మారుతి (10) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 22-11-2026న ఉదయం 11 గంటల నుంచి బాలుడు ఇంటి వద్ద కనిపించకుండా పోయినట్లు అతని తండ్రి దేవీదాస్ మానూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిసినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే మానూర్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. బాలుడి ఆచూకీ కనుగొనడంలో ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్:8712656758 (ఎస్ఐ, మానూర్)

Sthanikam

దన్వార్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి అదృశ్యం

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం దన్వార్ గ్రామానికి చెందిన సంగజోల్ల మారుతి (10) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 22-11-2026న ఉదయం 11 గంటల నుంచి బాలుడు ఇంటి వద్ద కనిపించకుండా పోయినట్లు అతని తండ్రి దేవీదాస్ మానూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిసినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే మానూర్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. బాలుడి ఆచూకీ కనుగొనడంలో ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్:8712656758 (ఎస్ఐ, మానూర్)

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి