యాదాద్రి భువనగిరి మండల పరిధిలో
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం – 2026 సందర్భంగా, హమారా శౌచాలయ్ – గరిమామయ్ భవిష్యత్ ప్రచార కార్యక్రమాన్ని 2026 నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో, యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) , జిల్లా రెవెన్యూ అధికారి , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి , జిల్లా పంచాయతీ అధికారి , వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు బృంద సభ్యులు పాల్గొన్నారు.
ఈ ప్రచారం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణ, గౌరవప్రదమైన పారిశుద్ధ్య సదుపాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు సంపూర్ణ పారిశుద్ధ్య లక్ష్య సాధనకు కృషి చేయడం ప్రధాన ఉద్దేశ్యం.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి