నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ మేరకు రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి ప్రతిపాదనలను అందజేశారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి 20 నూతన ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా నారాయణఖేడ్,శంకరంపేట బస్టాండ్ల ఆధునీకరణ,మరమ్మతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు,ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం బస్సు ప్రయాణాలపై ఆధారపడుతున్నారని,ప్రస్తుతం ఉన్న బస్సులతో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.అలాగే బస్టాండ్లను ఆధునీకరిస్తే ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఎమ్మెల్యే అందించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.నూతన బస్సుల కేటాయింపు, బస్టాండ్ల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన రవాణా,మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌కు 20 కొత్త ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే వినతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి