కోలాటాలు, భజనలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ.
చిట్యాల: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారికి భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం చేనేత పట్టుచీర సమర్పించారు. ముందుగా హనుమాన్ ఆలయంలో చీరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కోలాటాలు, భజనలతో ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు.
చీర దాత చేపూరి శ్రీనివాస్–శోభ దంపతులను సత్కరించారు. అనంతరం చేపూరి శ్రీనివాస్, సంఘం ఛైర్మన్ జెల్లా మనోహర్ కలిసి పట్టుచీరను ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్‌కు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈ చేనేత పట్టుచీరతో అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ ఛైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, చేనేత సహకార సంఘం ప్రతినిధులు, పద్మశాలి కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి