విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, పార్లమెంటరీ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్‌లో పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్ ముస్లాపూర్ విద్యార్థిని పి. పూజశ్రీ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్‌కు ఎంపికైంది. జిల్లా స్థాయి కార్యక్రమంలో 31 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, పార్లమెంట్ సభ్యుల పాత్రలను పోషించారు. ప్రశ్నోత్తరాలు, చర్చలు, సభా నిర్వహణ, బిల్లులపై చర్చ వంటి అంశాలను విద్యార్థులు సమర్థవంతంగా ప్రదర్శించారు. ఇందులో పి. పూజశ్రీ నీటిపారుదల శాఖ మంత్రి పాత్రను ప్రతిభావంతంగా పోషించి విజేతలలో స్థానం సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పూజశ్రీని అభినందించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించిన సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆంజనేయులు, సంతోష్‌లను కూడా అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ పూజశ్రీ మంచి ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, డీఈఓ ఎస్. రాజు, ఏఎంఓ సుదర్శన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ముస్లాపూర్ విద్యార్థిని పూజశ్రీకి అరుదైన అవకాశం.. రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్‌కు ఎంపిక

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి