దేశవ్యాప్తంగా ఓటు చోరీపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు మద్దతుగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవరి ఓటును తొలగించకూడదని, ఓటర్ల జాబితాలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి