యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం, వెంకిర్యాల గ్రామంలోని మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
వారు మాట్లాడుతూ
విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, మన పండుగల విశిష్టతను చాటిచెప్పేలా ఈ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పి. జ్యోతి , ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి