Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:23 AM

ప్రత్యామ్నాయం ఏదీ?.. ముందస్తు సమాచారం లేకుండా దిమ్మెలు వేస్తారా?: అధికారులపై చెరుకు శివకుమార్ గౌడ్ నిప్పులు!

10-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత రద్దీగా ఉండే వలిగొండ రోడ్డు జంక్షన్‌ను ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రాత్రికి రాత్రే మూసివేయడంపై స్థానికులు భగ్గుమన్నారు. భారీ క్రేన్ల సహాయంతో సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి రహదారిని మూసివేయడాన్ని నిరసిస్తూ నాయకుడు చెరుకు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు మెరుపు ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి అధికారుల చర్యలను అడ్డుకోవడంతో చౌటుప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... జాతీయ రహదారుల అధికారుల ఏకపక్ష వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నిత్యం వేలాది మంది వాహనదారులు, పాదచారులు, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే కీలకమైన జంక్షన్‌ను రాత్రికి రాత్రే మూసివేయడం దారుణం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండర్‌పాస్, ఫ్లైఓవర్ లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికుల భద్రతను పూర్తిగా గాలికొదిలేయడమే" అని విమర్శించారు.​తక్షణమే మూసివేత పనులను నిలిపివేయాలని, ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సమస్యలను గుర్తించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు.​ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, వ్యాపారులు, భారీ సంఖ్యలో వాహనదారులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

Sthanikam

ప్రత్యామ్నాయం ఏదీ?.. ముందస్తు సమాచారం లేకుండా దిమ్మెలు వేస్తారా?: అధికారులపై చెరుకు శివకుమార్ గౌడ్ నిప్పులు!

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత రద్దీగా ఉండే వలిగొండ రోడ్డు జంక్షన్‌ను ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రాత్రికి రాత్రే మూసివేయడంపై స్థానికులు భగ్గుమన్నారు. భారీ క్రేన్ల సహాయంతో సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి రహదారిని మూసివేయడాన్ని నిరసిస్తూ నాయకుడు చెరుకు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు మెరుపు ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి అధికారుల చర్యలను అడ్డుకోవడంతో చౌటుప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... జాతీయ రహదారుల అధికారుల ఏకపక్ష వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నిత్యం వేలాది మంది వాహనదారులు, పాదచారులు, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే కీలకమైన జంక్షన్‌ను రాత్రికి రాత్రే మూసివేయడం దారుణం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండర్‌పాస్, ఫ్లైఓవర్ లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికుల భద్రతను పూర్తిగా గాలికొదిలేయడమే" అని విమర్శించారు.​తక్షణమే మూసివేత పనులను నిలిపివేయాలని, ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సమస్యలను గుర్తించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు.​ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, వ్యాపారులు, భారీ సంఖ్యలో వాహనదారులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News