రామన్నపేట అక్టోబర్ 9 స్థానికం ప్రతినిధి :
రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం నకిరేకల్ నియోజకవర్గ మహిళా విభాగం కో-ఇన్‌చార్జిగా బాషమళ్ల అనిత సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం రామన్నపేట పట్టణంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్ ఆమె నియామకాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా గనగాని రమేష్ మాట్లాడుతూ వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు ప్రతి వార్డు సభ్యుడికి హెల్త్ కార్డు కల్పించాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. వార్డు సభ్యుల హక్కుల సాధనకు ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి