Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Updated : 29 Nov 2026 20:36 IST
As Preferred Source 1 min read
కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో వివిధ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తెలిపారు. కోదాడలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణుల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలో రూ.250 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.26 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రూ.19 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్, రూ.20 కోట్లతో పెద్ద చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రూ.50 కోట్లతో నవోదయ పాఠశాల, మున్సిపల్ భవనం, షాపింగ్ కాంప్లెక్స్, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Article Image

కోదాడ పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో వివిధ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తెలిపారు. కోదాడలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణుల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలో రూ.250 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.26 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రూ.19 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్, రూ.20 కోట్లతో పెద్ద చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రూ.50 కోట్లతో నవోదయ పాఠశాల, మున్సిపల్ భవనం, షాపింగ్ కాంప్లెక్స్, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి