Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

చదువుతో పాటు వ్యాయామం ఎంతో అవసరం

Updated : 29 Nov 2026 20:33 IST
As Preferred Source 1 min read
చదువుతో పాటు వ్యాయామం ఎంతో అవసరం

విద్యార్థులు చదువుతో పాటు శారీరక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి సూచించారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు వ్యాయామంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యార్థులతో కలిసి వ్యాయామం చేయించి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉండటంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించడంతో పాటు జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించకుండా క్రీడలు, వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలని, మంచి ఆరోగ్యపు అలవాట్లతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మున్నీర్, లింగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చదువుతో పాటు వ్యాయామం ఎంతో అవసరం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news