Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గో సంపద ఉన్నచోటే ధర్మం వర్ధిల్లుతుంది

Updated : 29 Nov 2026 20:33 IST
As Preferred Source 1 min read
గో సంపద ఉన్నచోటే ధర్మం వర్ధిల్లుతుంది

​పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి

గో కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

గో సంపద సమృద్ధిగా ఉన్నచోటే ధర్మం వర్ధిల్లుతుందని, ఆ ప్రాంతం పాడిపంటలతో కళకళలాడుతుందని పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీ స్వామీజీ ప్రవచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లగిరి సమీపంలో ఆదివారం ఏనుగు సత్తిరెడ్డి-జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యక్ష వృషోత్సర్జన, గో కల్యాణం వైభవంగా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.​ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ.. గోవులపై నిర్లక్ష్యం వల్లే కరువు, అశాంతి నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గరుడ పురాణంలోనూ ప్రస్తావించిన అరుదైన వృషోత్సర్జన (ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయడం) కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ ప్రాంతానికి శుభసూచకమన్నారు. "కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్న ప్రజలు గోవును పెంచడం లేదు. గోవు దగ్గర అరగంట కూర్చుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పోషకాలు మెండుగా ఉండే ఆవుపాలను సేవించాలి" అని పిలుపునిచ్చారు.​అనంతరం భక్తులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సర్పంచ్ రిక్కల మహేందర్ రెడ్డి, ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, తంగిరాల సత్యనారాయణ శాస్త్రి, బంగారయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గో సంపద ఉన్నచోటే ధర్మం వర్ధిల్లుతుంది

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news