Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పేదలకు న్యాయం అందించడమే న్యాయవాదుల లక్ష్యం కావాలి

Updated : 29 Nov 2026 20:35 IST
As Preferred Source 1 min read
పేదలకు న్యాయం అందించడమే న్యాయవాదుల లక్ష్యం కావాలి

న్యాయవాదులు పేద ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మందడపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా రెండో మహాసభల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులు, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర అధ్యయనంతో వృత్తిలో రాణించాలని సూచించారు. మహాసభలో జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్లపాటు నెలకు రూ.10 వేల స్కాలర్‌షిప్, డెత్ బెనిఫిట్‌ను రూ.25 లక్షలకు పెంచాలని తీర్మానించారు. కోదాడకు అదనపు జిల్లా కోర్టు, సూర్యాపేటకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, తుంగతుర్తిలో నూతన కోర్టు భవనం నిర్మించాలని, కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐలు, బార్ అసోసియేషన్ నాయకులు, జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు న్యాయం అందించడమే న్యాయవాదుల లక్ష్యం కావాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి