కోదాడ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాలు, ఎత్తిపోతల పథకాలు సహా వివిధ అభివృద్ధి పనులను రూ.2 వేల కోట్లతో చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తెలిపారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5,350 మందికి రూ.23 కోట్ల సాయం అందించామని, 5,500 ఇందిరమ్మ ఇళ్లు, 560 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
కోదాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి