తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా కోదాడ పట్టణంలోని ఏఆర్ఏఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాటి ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రస్తుత ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి