పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
వైభవంగా 'స్వచ్ఛతా హి సేవా'.. మహిళా సంఘాలకు చెత్త బుట్టలు, మొక్కల పంపిణీ
పట్టణ పరిశుభ్రత అనేది కేవలం పురపాలక వర్గం బాధ్యతే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛతా హి సేవా 2026’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది, మహిళా సమాఖ్య లీడర్లు, సంఘాల సభ్యులకు తడి, పొడి చెత్త వేరుచేసే విధానంపై అవగాహన కల్పించడంతో పాటు చెత్త బుట్టలు, మొక్కలను పంపిణీ చేశారు.
తడి-పొడి చెత్త వేరు చేయాలి
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరువేరుగా సేకరించి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించాలని కోరారు. చౌటుప్పల్‌ను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, దానిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవచ్చని సూచించారు. అనంతరం సభలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు కొసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి, పల్లె లావణ్య, ఉదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలే శ్రీలత, కాసర్ల మంజుల, బద్రి గాలయ్య, దేప రమ్య, పాక చిరంజీవి, బత్తుల వాణి, ఉడుగు జ్యోతి, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, చింతల ఉమామహేశ్వరి, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్, పస్తం గంగారాములు, సందగళ్ల విజయ, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నాబీబి జానీ బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా ఆర్పీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి