Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:59 PM

మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పీపల్‌పహాడ్ ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్ గౌడ్

09-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: శ్రవణ్

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పీపల్‌పహాడ్ గ్రామ ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.​తనపై నమ్మకంతో మండల అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శ్రవణ్ కుమార్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుంటానని పేర్కొన్నారు.​తన ఎన్నికకు సహకరించిన మునుగోడు, చౌటుప్పల్ మండల కాంగ్రెస్ నాయకులకు, పీపల్‌పహాడ్ గ్రామ సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవి ద్వారా పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పీపల్‌పహాడ్ ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్ గౌడ్

Article Image

నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: శ్రవణ్

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పీపల్‌పహాడ్ గ్రామ ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.​తనపై నమ్మకంతో మండల అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శ్రవణ్ కుమార్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుంటానని పేర్కొన్నారు.​తన ఎన్నికకు సహకరించిన మునుగోడు, చౌటుప్పల్ మండల కాంగ్రెస్ నాయకులకు, పీపల్‌పహాడ్ గ్రామ సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవి ద్వారా పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News