చిట్యాల: బీజేపీ సీనియర్ నాయకుడు, చిట్యాల ముద్దుబిడ్డ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కాసం వెంకటేశ్వర్లు గతంలో ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి