Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:52 PM

ఆపదలో ఉన్న కుటుంబానికి ప్రెస్ క్లబ్ కోదాడ అండ

09-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ జీవనోపాధికి దూరమైన ఓ నిరుపేద వ్యక్తికి నిత్యావసర సరుకులు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.కోదాడ పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో పనులకు వెళ్లలేక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన దీనస్థితిని తెలుసుకున్న ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు స్పందించారు. తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను అందజేసి ఆయనకు అండగా నిలిచారు.ఈ సేవా కార్యక్రమానికి కాసారపు కృష్ణ (చందు మొబైల్స్), ఎం.డీ. రహీమ్, షేక్ నూరుద్దీన్ నిత్యావసర సరుకులను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలకు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, గౌరవ సలహాదారు వీరాంజనేయులు, సభ్యులు బానాల అబ్రహాం, జగన్ మోహన్ రావు, షేక్ నూరుద్దీన్, ఉపేందర్, జి. మోహన్, ఏ. వెంకటేశ్వరులు, గోపీచంద్, ఎం.డీ. రహీమ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న కుటుంబానికి ప్రెస్ క్లబ్ కోదాడ అండ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News