ఆకట్టుకున్న విద్యార్థినుల ఆటపాటలు, దాండియా
శ్రీ గాయత్రి జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు గురువారం అత్యంత వైభవంగా, కన్నులపండుగగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, పట్టువస్త్రాలు ధరించిన విద్యార్థినుల ఆటపాటలతో కళాశాల ప్రాంగణమంతా పండగ శోభ సంతరించుకుంది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల కరస్పాండంట్ బీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిని, ఆడపడుచులను గౌరవించే గొప్ప పండుగని కొనియాడారు. చదువుతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో ఐక్యతను పెంచుతాయని పేర్కొన్నారు.కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను తమ కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఆధునిక విద్యను అభ్యసిస్తూనే సాంస్కృతిక రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలు, దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ దయాకర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి