అరిటాకుల ఖర్చుకు ఆర్థిక సాయం అందిస్తానని కమిషనర్ హామీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు ప్లాస్టిక్ విస్తర్లు, గ్లాసులను పూర్తిగా నిషేధించి, సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లోనే వడ్డించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సూచించారు. అరిటాకుల కొనుగోలుకు ఆర్థికంగా తన వంతు తోడ్పాటు అందిస్తానని ఆయన దేవాలయ కమిటీకి హామీ ఇచ్చారు.పట్టణంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం అయ్యప్ప దీక్షాపరులకు కమిషనర్ వెంకటేశ్వర నాయక్ - లావణ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని, భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు. తాను రెండోసారి శబరిమల అయ్యప్ప దీక్ష చేపట్టడం ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తోందన్నారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం కమిషనర్ కుటుంబ సభ్యులు హాసిని, ప్రజయ్, హుస్సేన్‌లు స్వాములకు భక్తిశ్రద్ధలతో భోజనాలు వడ్డించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిళ్ల మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, గురుస్వాములు ఉప్పు ఆంజనేయులు, కంచరకుంట్ల వెంకటరెడ్డి, తాడూరు పరమేష్, బోరం రాజశేఖర్ రెడ్డి, పెద్దగోని రమేష్ గౌడ్, మలిగే శ్రీను, భిక్షా నాయక్, పాశం కృష్ణ, కన్నె స్వామి కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, భక్తులు బోడిగే బాలకృష్ణ, సుక్క సుదర్శన్, శివ, దర్శన్, బొడ్డు రాజేందర్ రెడ్డి, బొబ్బిళ్ల సామ్రాట్, కేతరాజు మహేష్, ఓర్సు రాజు, సోను నాయక్, ఈశ్వర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి