కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని ప్రేమిస్తూ ఆడపడుచుల ఆత్మీయతను చాటిచెప్పే పండుగ అని పేర్కొన్నారు. విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను కోదాడ చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమాన్ని తెలుగు లెక్చరర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు సమన్వయం చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

Harish reporter
కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని ప్రేమిస్తూ ఆడపడుచుల ఆత్మీయతను చాటిచెప్పే పండుగ అని పేర్కొన్నారు. విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను కోదాడ చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమాన్ని తెలుగు లెక్చరర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు సమన్వయం చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి