Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 11:36 PM

ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు చేపట్టాలి: జిల్లా ఎస్పీ

08-10-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనగూడ వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి–65 (ఎన్‌హెచ్‌-65) రోడ్డు విస్తరణ పనులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పరిశీలించారు.ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు,సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.పనులు పూర్తికావడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలను తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.ముఖ్యంగా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలని తెలిపారు.రోడ్డు పనులు కొనసాగుతున్న సమయంలో ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన,సురక్షితమైన రహదారి సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో జిన్నారం డీఎస్పీ ప్రభాకర్,ఇస్నాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు,సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు చేపట్టాలి: జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News