నారాయణఖేడ్: మానూర్ మండలం కమలాపూర్ గ్రామంలోని చెరువును నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్,ఇరిగేషన్ ఏఈ నాగరాణితో కలిసి పరిశీలించారు. చెరువులోని కాలువలు, తూముల పరిస్థితిని పరిశీలించి, మరమ్మతులు అవసరమైన ప్రాంతాలపై అధికారులతో చర్చించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మరమ్మతులను త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. చెరువు నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, దత్తు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 08, 2026 11:37 PM
కమలాపూర్ చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

08-10-2026
59 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్: మానూర్ మండలం కమలాపూర్ గ్రామంలోని చెరువును నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్,ఇరిగేషన్ ఏఈ నాగరాణితో కలిసి పరిశీలించారు. చెరువులోని కాలువలు, తూముల పరిస్థితిని పరిశీలించి, మరమ్మతులు అవసరమైన ప్రాంతాలపై అధికారులతో చర్చించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మరమ్మతులను త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. చెరువు నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, దత్తు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి