దసరా పండుగను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో సిర్గాపూర్ గ్రామపంచాయతీ శానిటరీ సిబ్బందికి దసరా కానుకగా బట్టలను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బందికి బట్టలు అందజేసి వారి సేవలను అభినందించారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య సిబ్బందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్‌పర్సన్ రాజ్‌కుమార్, జోన్ చైర్మన్ వెంకట్రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ అధ్యక్షులు బావుగి సాయి సంగమేశ్వర్, కార్యదర్శి బల్లెపు మల్లేష్, సభ్యులు ముదస్సిర్ తదితరులు పాల్గొన్నారు. బట్టలను అందజేసిన దాత లయన్ అరవింద్ చోల్కర్ (బాంబే కట్‌పీస్–నారాయణఖేడ్)కు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పారిశుధ్య సిబ్బందికి లయన్స్ క్లబ్ దసరా కానుక

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి