రామన్నపేట : మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మొహమ్మద్ అబ్దుల్ వహిద్ అంజాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేటలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి శైలజ, జిల్లా ఇన్‌చార్జి ఎడుమేకల మహేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాధారపు మహేష్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము రామస్వామి, ఉపాధ్యక్షుడిగా సింగణబోయిన బాలరాజు ఎన్నికయ్యారు. నకిరేకల్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిలుగా చిన్నపాక రమేష్, బాషమల్ల అనిత సంతోష్ ఎంపికయ్యారు. నూతన కమిటీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి