కంగ్టి మండలం ముకుంద నాయక్ తండా శివారులో ఒకే భూమిని పలువురికి విక్రయించేందుకు అగ్రిమెంట్లు చేసి డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదుతో ఏడుగురిపై కంగ్టి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముకుంద నాయక్ తండాకు చెందిన రాజు రాథోడ్, ఆడే రవీందర్, ఆడే చవాన్ రాజ్ మధ్యవర్తులుగా, ఆడే దేవీసింగ్, శంకర్, పండరి, పుండ్లిక్‌లు పట్టాదారులుగా పేర్కొంటూ కరీంనగర్‌కు చెందిన కోలా రమేష్‌కు సర్వే నంబర్ 99లోని 8.10 ఎకరాల భూమిని విక్రయించేందుకు గత ఏడాది జూలైలో అగ్రిమెంట్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నుంచి రూ.31 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, అనంతరం స్లాట్ బుక్ చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా వివిధ కారణాలతో కాలయాపన చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమి వివరాలను పరిశీలించిన రమేష్‌కు, తనతో అగ్రిమెంట్ చేయడానికి ముందే అదే భూమిపై హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో మరో రెండు అగ్రిమెంట్లు చేసి డబ్బులు తీసుకున్న విషయం తెలిసిందని తెలిపారు. దీంతో రమేష్ కంగ్టి పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండలాల పరిధిలో ఒకే భూమిని పలువురికి అగ్రిమెంట్ చేసిన ఘటనల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఒకే భూమిని పలువురికి విక్రయించే యత్నం.. ఏడుగురిపై కేసు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి