రామన్నపేట అక్టోబర్ 9 స్థానికం ప్రతినిధి :
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు.ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు అశోక్‌కుమార్, అశోక్‌రెడ్డితో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి