పుట్టపర్తి కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్మాణ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా కామ్రేడ్ ఓబులు మాట్లాడుతూ.. నిర్మాణ రంగ కార్మికులు, స్కీం వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించి, వారి హక్కులను సాధించేందుకు ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం, పనికి తగిన వేతనం అమలు చేయాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కార్మికుల శ్రమను దోపిడీ చేయకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా చట్టబద్ధమైన హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యలపై ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారికి గౌరవప్రదమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించే వరకు సీఐటీయూ పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ వర్క్‌షాప్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, zp శ్రీనివాసులు,GL నరసింహ, కోశాధికారి, N లక్ష్మీ నారాయణ ఆఫీస్ బేరర్స్ పైపలి గంగాధర, సాంబ, బాబ్జాన్, రామ్మోహన, దిల్షాద్, నారాయణ, AWW జిల్లా కార్యదర్శి ,కోశాధికారి V శ్రీదేవి, రంగమ్మ, ఆశా సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, అధ్యక్షురాలు,N సౌభాగ్య, రమాదేవి, రాధా తదితర వర్కర్లు రంగ కార్మికులు, స్కీం వర్కర్లు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి