పుట్టపర్తి కేంద్రంలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జాతీయ నాయకులు, ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,
సత్యసాయి జిల్లాలో వర్షా భావ పరిస్థితులు ఏర్పడి పంటలన్ని ఎండి పోయి రైతులు పెట్టు బడులు తిరిగి రాక తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పంటలు ఎండి పోతున్నాయి, భూగర్భ జలాలు ఎండి పోతున్నాయి, పశువు లకు మేత లేక తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇంతవరకు సహక చర్యలు, ప్రకటించలేదు, ప్రత్యామ్నాయ విధానాలు ప్రచార ఆర్బాటాలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అవుతున్నాయి.నీటి సౌకర్యం వున్న రైతులకు కావలసినన్ని గడ్డి విత్తనాలు సరఫరా చేయాలి. వెనుక పడిన సత్యసాయి జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.అన్ని రకాల రైతుల పంటల రుణాలు మాఫీ చేయాలి. అన్ని పంటలకు ఉచిత బీమా అమలు చేయాలి.పశు గ్రాసం కేంద్రాలు ప్రభుత్వం ఎర్పాటు చేయాలి.
కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడని అన్నారు. ఏపీ రైతు సంఘం బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
రైతుల హక్కుల కోసం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మల్లారెడ్డి గారు నిరంతరం పోరాటాలు నిర్వహించారని, రైతాంగాన్ని సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే సీపీఎం పార్టీ అభివృద్ధికి కూడా ఆయన విశేష సేవలు అందించారని అన్నారు.రైతు ఉద్యమానికి, కార్మిక–కర్షక ఐక్యతకు ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మల్లారెడ్డి గారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న,A హరి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, బ్యాళ్ల అంజి, యోగానంద, రామిరెడ్డి, శివన్న, మారుతి, మాధవరెడ్డి, శివారెడ్డి, శ్రీరాములు, సుధాకర్ రెడ్డి,సీపీఎం జిల్లా కార్యదర్శి C రామకృష్ణ CITU జిల్లా కార్యదర్శి,GL నరసింహ, కోశాధికారి, N లక్ష్మీ నారాయణ,కార్యకర్తలు పాల్గొని కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి