Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

భర్త హత్య కేసులో కిలాడీ భార్య, ప్రియుడు అరెస్ట్

24-08-2026 721 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు!

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం శనగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దానయ్య భార్య రాపోలు శారద (34)కి, ఆమె స్వంత బావ కుమారుడైన రాపోలు శివ (19)తో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి భర్త దానయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన శారద, ప్రియుడు శివతో కలిసి అతనిని అంతమెందించేందుకు పథకం వేసింది. ​ఈ నెల 23న మధ్యాహ్నం సమయంలో పంతంగి వద్ద దానయ్యపై ముందుగా రాయితో దాడి చేసి, ఆపై కర్రతో తలపై తీవ్రంగా కొట్టడంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ నాయకత్వంలో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు.చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితులైన రాపోలు శివ, రాపోలు శారదలను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. కేసును త్వరితగతిన ఛేదించిన ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ఎస్సైలు కె. యాదగిరి, పి. రవీందర్, బి. అజయ్ భార్గవ్, సిబ్బంది అశోక్, ఉదయ్, జంగయ్యలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

భర్త హత్య కేసులో కిలాడీ భార్య, ప్రియుడు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News