Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి

24-08-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.

Sthanikam

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి

Article Image

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News